కుత్బుల్లాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ లోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి చెందిన డీసీఎం వాహనం అదుపుతప్పి రోడ్డుపై ఉన్న డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మరణించగా, కొంతమందికి గాయాలయ్యాయి. డీసీఎంలో మొత్తం 16 మంది ప్రయాణిస్తునట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి  చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని దగ్గరలో ఉన్న మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఇందులో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

గౌడవెల్లి నుండి హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్ కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.