విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్.. ఇద్దరు యువకులు

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాద ఘటన హైదరాబాద్ శివారులోని కుత్బుల్లాపూర్ గుండ్ల పోచంపల్లిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. శనివారం (డిసెంబర్ 7) తెల్లవారుజూమున బైక్ పై ఇద్దరు యువకులు వేగంగా దూసుకెళ్లారు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు చనిపోయారు. 

Also Read : వీకెండ్ కల్లు పార్టీ కోసం.. కారులో వెళుతుంటే

ఓ యువకుడు స్పాట్‎లోనే కన్నుమూయగా.. మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతులను కార్తీక్ రెడ్డి(23), అనిల్(23)గా గుర్తించారు పోలీసులు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.