ఆర్టీసీ బస్సు–కారు ఢీ.. పలువురికి గాయాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. వేములవాడ రూరల్ మండలంలోని పొశేట్టిపల్లి–నాగయ్యపల్లి గ్రామల మధ్య ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలైయ్యాయి. వేగంగా వచ్చిన కారు ఆర్టీసీ బస్సును డీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయి. దీంతో బస్సులోని 13 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు.

ఇక కారులో భార్యభర్తలతో పాటు 6 నెలల బాబు,18 నెలల పాప ప్రయాణిస్తున్నారు. 18 నెలల పాప కాలుకు తీవ్ర గాయం కాగా..మిగతా ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. వీరు కరీంనగర్ కి చెందిన కుంటుంబంగా గుర్తించారు. గాయపడిన వారిని ఆదే దారిలో వెళ్తున్న పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ జాం అవ్వగా.. పోలీసులు క్లియర్ చేశారు.