తిరుపతిలో రోడ్డు ప్రమాదం : ఇద్దరు తెలంగాణ వాళ్లు మృతి

తిరుపతిలో రోడ్డు ప్రమాదం : ఇద్దరు తెలంగాణ వాళ్లు మృతి

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రేణిగుంట మండలం కుక్కల దొడ్డి మామండూరు మధ్యలో ఎదురెదురుగా వస్తున్న ప్రయివేటు బస్సు, కారు ఢీ కొనడంతో కారు నుజ్జు నుజ్జయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ వాసులు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 

చనిపోయిన వారిని తెలంగాణకు చెందిన అంజలి దేవి(40), సందీప్(45) గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించి దర్యాప్తు జరుపుతున్నారు.