![కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్](https://static.v6velugu.com/uploads/2025/02/road-accident-in-uttar-pradesh-details-here_tEhZkNUWmJ.jpg)
- కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్
- కారు, ట్రక్కు ఢీకొని ఐదుగురు దుర్మరణం
- యూపీలో ఘోర ప్రమాదం
బహ్రైచ్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారు.. ట్రక్కును ఢీకొట్టడంతో ఆర్మీ జవాన్ సహా అతని కుటుంబంలోని ఐదుగురు మృతి చెందారు. బహ్రైచ్, -లక్నో హైవేపై మంగళవారం ఈ యాక్సిడెంట్జరిగింది. అబ్రార్ అహ్మద్ (28) అనే ఆర్మీ జవాన్ తన 18 రోజుల కుమార్తెను ట్రీట్మెంట్ కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి లక్నోకు వెళుతుండగా ఉదయం 7:30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆర్మీ జవాన్, అతని తండ్రి గులాం హజ్రత్ (60), తల్లి ఫాతిమా బేగం (56), కుమార్తె హనియా, కారు డ్రైవర్ చంద్ మొహమ్మద్ (35) అక్కడికక్కడే మరణించారు. అదే విధంగా ఈ ప్రమాదంలో అబ్రార్ భార్య రుకయ్య (25)కు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను బహ్రైచ్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ట్రక్ డ్రైవర్ వెహికల్‌ను అక్కడే వదిలి పారిపోయాడని, అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.