వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం

వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం
  • ప్రైవేట్‌‌‌‌ బస్సును ఢీకొట్టిన రెండు కార్లు
  • ఒకరు మృతి, 42 మందికి గాయాలు

పెబ్బేరు, వెలుగు : రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొని డివైడర్‌‌‌‌ను దాటి ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి స్పాట్‌‌‌‌లోనే చనిపోగా, బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది గాయపడ్డారు. ఈ ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరి సమీపంలోని రంగాపూర్‌‌‌‌ బైపాస్‌‌‌‌ రోడ్డులో జరిగింది. 

పెబ్బేరు ఎస్సై హరిప్రసాద్‌‌‌‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెబ్బేరుకు చెందిన ముష్టి విష్ణు (35) తన భార్య, కొడుకు, ఇద్దరు కూతుళ్లతో కారులో వెళ్తుండగా, మరో కారులో ఎనిమిది మంది మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ వైపు వెళ్తున్నారు. పెబ్బేరు సమీపంలోని రంగాపూర్‌‌‌‌ బైపాస్‌‌‌‌లో ఈ రెండు కార్లు ఢీకొని, డివైడర్‌‌‌‌ అవతలి వైపు దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న పెండ్లి బృందంతో ఉన్న ట్రావెల్స్‌‌‌‌ బస్సును ఢీకొన్నాయి. 

ప్రమాదంలో విష్ణు అక్కడికక్కడే చనిపోగా, అతడి భార్య పరిస్థితి సీరియస్‌‌‌‌గా ఉంది. కొడుకు, ఇద్దరు కూతుళ్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరో కారులో ఉన్న ఎనిమిది మందితో పాటు బస్సులో ఉన్న 30 మంది గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని వారిని వనపర్తి జిల్లా హాస్పిటల్‌‌‌‌కు తరలించారు.