
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2023 జూన్ 25 సాయంత్రం ఆత్మకూరు మండల కేంద్రం శివారులోని కటాక్షపూర్-ఆత్మకూరు మధ్య జాతీయ రహదారిపై టిప్పర్.. కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళ, చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు.
బాధితులు మేడారం వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తం కారులో 8 మంది ఉన్నారు. గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతులు నరసింహస్వామి(50), సాంబరాజు(42), ఆకాంక్ష(26) లక్ష్మిప్రసన్న (6)గా గుర్తించారు.
ఈ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై వరంగల్ సీపీ రంగనాథ్‌తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.