డివైడర్‭ను ఢీ కొట్టి ఎగిరిపడిన కారు.. ఐదుగురు మృతి

బాపట్ల జిల్లాలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒంగోలు వైపు నుంచి గుంటూరు వెళ్తున్న కారు.. కొరిశపాడు మండలం మేదరమెట్ల బైపాస్ సమీపంలో టైరు పంక్చరైంది. దీంతో ఒక్కసారిగా అదుపు తప్పిన కారు.. డివైడర్‌ను ఢీకొని ఎగిరి రోడ్డుకు అటువైపు పడింది. అదే సమయంలో గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న లారీ, కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.