
ఆదిలాబాద్ జిల్లా జందాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు ఢీ కొట్టింది.. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో సహ ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో తొమ్మిది మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. గాయపడిన వారిని రిమ్స్ అసుపత్రికి తరలించారు.
జందాపూర్ జాతీయ రహదారి పై మార్చి 9న తెల్లవారుజామున లారీ టైర్ పేలిపోవడంతో రోడ్డపైనే నిలిచిపోయింది. అదే సమయంలో హైదారాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ వెళ్తున్న బస్సు లారీని వెనక నుంచి ఢీ కొట్టడంతో లారీ ఉన్న ఇద్దరు చనిపోగా.. బస్సులో ఉన్న వారికి గాయాలు అయ్యాయి. బస్సు ముందు భాగం నుజ్జనుజ్జ అయ్యింది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.