ఘోర రోడ్డు ప్రమాదం...అదుపుతప్పి ఆటోలపై పడిన కంటైనర్​.. ఏడుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం...అదుపుతప్పి ఆటోలపై పడిన కంటైనర్​.. ఏడుగురు మృతి

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామునూరు పీఎస్​ సమీపంలో  రైలు పట్టాల లోడ్ తో  వస్తున్న  కంటైనర్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోలపై పడింది.  ఈ ప్రమాదంలో ఐదుగురు స్పాట్ లోనే చనిపోగా..ఇద్దరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందారు. మరి కొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి.  ఘటనా స్థలానికి వచ్చిన అధికారులు,పోలీసులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.  ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

 లారీ ఖమ్మం నుంచి వరంగల్ వెళ్తోంది..ఆటో కూడా  వరంగల్ వెళ్తుండగా  మామునూరు బెటాలియన్ సమీపంలో ఈ  ఘటన జరిగింది.  ప్రమాదం జరిగిన సమయంలో లారీ డ్రైవర్​  మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది.  లారీ డ్రైవర్​ ను  పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

ఈ ప్రమాదంతో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డుకిరువైపులా కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్డుపై పడ్డ రైలు పట్టాలను పోలీసులు తొలగిస్తున్నారు. మృతులంతా కూలి పనులు చేసుకునే వాళ్లుగా పోలీసులు చెబుతున్నారు.  కొన్ని మృతదేహాలను గుర్తుపట్టడం కష్టంగా మారింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.