
హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉస్మానియా పరిధిలోని అడిక్ మెంట్ బ్రిడ్జిపై ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పడంతో ఇద్దరు విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతులిద్దరు ఓయూ ఇంజినీరింగ్(మైనింగ్) విద్యార్థులుగా గుర్తించారు.
ప్రమాదానికి అతి వేగం కారణం అయి ఉండవవచ్చని భావిస్తున్నారు. ప్రమాద ఘటనతో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు క్లియ్ చేశారు మృత దేహాలను గాంధీ హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఓయూ పోలీసులు. విద్యార్థులు జాగ్రత్తగా బైక్ నడపాలని సూచించారు. అలాగే మైనర్లకు బైకులు ఇవ్వొద్దని తల్లిదండ్రులను హెచ్చరించారు.