కీసర ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం

మేడ్చల్ జిల్లా : కీసర ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి.  ఘట్‌కేసర్‌ నుంచి వస్తున్న బెంజ్ కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టి ఎదురుగా మీర్‌పేట్‌ నుంచి వస్తున్న మరో కారును బలంగా ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రనులను ఆసుపత్రికి తరలించారు. దీనిపై  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.