ఓఆర్​ఆర్​పై రోడ్డు ప్రమాదం.. వాటర్​ ట్యాంకర్​ .. కారు ఢీ..ఇద్దరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం..

ఓఆర్​ఆర్​పై రోడ్డు ప్రమాదం.. వాటర్​ ట్యాంకర్​ .. కారు ఢీ..ఇద్దరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం..

ట్రాఫిక్ నియంత్రణ కోసం హైదరాబాద్ చుట్టూ నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రయాణికుల పాలిట మృత్యు శకటంగా మారింది. ఈ రోడ్డుపై మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ వాహనాలు ప్రమాదాల బారిన పడుతున్నాయి.ఈ ప్రమాదాల్లో అనేక మంది మృత్యువాత పడుతున్నారు. తాజాగా ఔటర్ పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.  ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి

రంగారెడ్డి జిల్లా రావిర్యాల ఎగ్జిట్​ 13 వద్ద  ఔటర్​ రింగ్​ రోడ్డుపై  మొక్కలకు నీరు పోస్తున్న నీళ్ల ట్యాంకర్ ను వేగంగా వస్తున్న  బ్రేజా కారు  ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో (టర్ మెన్, కారులో ఉన్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా  మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.  క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ | నిజాలను దాచకుండా బయట పెట్టండి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

 మృతి చెందిన వారిలో ఒకరు  నాగర్ కర్నల్  జిల్లా చిన్నోని బాయి మండలంబెక్కం  గ్రామానికి చెందిన బత్తిని కృష్ణ రెడ్డి కాగా మరొకరు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలన్ గ్రామానికి చెందిన  చెనమోని రాములు (ORR పై చెట్లకు నీళ్ళను పట్టుకున్న వ్యక్తి)గా గుర్తించారు.   మృతదేహాలను  పోస్టుమార్టం నిమిత్తం తరలించారు