శంషాబాద్, వెలుగు: ఓఆర్ఆర్పై ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌కు వెళ్లే రూట్లో కొత్వాల్ గూడా సమీపంలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో కారు ముందు భాగంగా నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని ఆర్జీఐ ట్రాఫిక్ పోలీసులు సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.