రాయదుర్గంలో ఆదివారం ( సెప్టెంబర్ 15) రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దుర్గం చెరువు దగ్గర బైక్ ను తప్పించబోయి ఆటో.. పక్కనే ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రత్నాభాయ్ (43) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఆటో డ్రైవర్‌తో పాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దుర్గేశ్వరి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. రత్నాభాయ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ALSO READ | డ్రైవర్ కు ఫిట్స్.. చిరు వ్యాపారుల దుకాణాలపై దూసుకెళ్లిన లారీ