![తిరుమల ఘాట్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం.. నలుగురు భక్తులకు తీవ్ర గాయాలు](https://static.v6velugu.com/uploads/2024/06/road-accident-on-tirumala-ghat-road-four-devotees-seriously-injured_64BaF2WYrq.jpg)
తిరుమల మొదటి ఘాట్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. 24వ మలుపు ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర జీపు గొడ్డను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని తిరుపతి రుయా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది. మరోవైపు తిరుమలలో పెద్దగా భక్తుల రద్దీ లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం లభిస్తుంది .. నిన్న శ్రీవారిని 76,291 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,495 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ.3.14 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది.