- ఆటోను ఢీకొట్టిన బొలేరో
- నలుగురు మృతి
- నిజామాబాద్ శివారులో ఘోర ప్రమాదం
- మృతుల్లో తండ్రీ కొడుకులు.. పలువురికి గాయాలు
- నిజామాబాద్ శివారులో ప్రమాదం
- మృతుల్లో తండ్రీ కొడుకులు.. పలువురికి గాయాలు
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ శివారులోని అర్సాపల్లి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ ఆటోను బొలేరో ఢీకొట్టడంతో నలుగురు కూలీలు మృతిచెందారు. ఇనుప సామాగ్రి లోడ్‌తో బోధన్ నుంచి నిజామాబాద్ వైపు వస్తున్న బొలేరో పికప్ వెహికల్.. అర్సాపల్లి వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను వేగంగా ఢీకొట్టి, బొల్తా కొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ రత్నావత్ ప్రశాంత్ (30), యశ్వంత్ (24), అతని తండ్రి శ్యామ్ (48) అక్కడికక్కడే చనిపోగా, రేఖ (28) అనే మహిళ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ మృతిచెందింది.
గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. తఆటోలోని వారంతా బోధన్ మండలం ఊట్‌పల్లి తాండకు చెందిన వారని పోలీసులు తెలిపారు. రేఖ భర్త రుడావత్ కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయని, అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదంలో మరణించిన యశ్వంత్‌కు ఏడాది కిందటే పెళ్లి జరిగింది. భర్త మృతి వార్త తెలుసుకొని భార్య కుప్పకూలిపోయింది.