బీఆర్ఎస్ సభకు పోయి తిరిగొస్తుండగా విషాదం.. యాక్సిడెంట్లో ఇద్దరు స్పాట్ డెడ్

బీఆర్ఎస్ సభకు పోయి తిరిగొస్తుండగా విషాదం.. యాక్సిడెంట్లో ఇద్దరు స్పాట్ డెడ్

సిద్ధిపేట: బీఆర్ఎస్ సభకు పోయి బైక్పై తిరిగొస్తుండగా ప్రమాదం జరిగింది. ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. సిద్ధిపేట జిల్లా నుంగునూర్ మండలం రాంపూర్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్లో జరిగిన సభ నుండి తిరిగి వస్తుండగా రాంపూర్ వద్ద టవేరా, బైక్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో.. బైక్ పైన వస్తున్న తడెం సారయ్య, మరో వ్యక్తి గణేష్ ఇద్దరూ మృతి చెందారు.

చనిపోయిన ఇద్దరు వ్యక్తులు హుస్నాబాద్ నియోజకవర్గం బస్వాపూర్ గ్రామానికి చెందిన వారిగా తెలిసింది. ఈ ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఆ ఇద్దరి మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

బస్వాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు మేస్త్రీలు తాడేం సారయ్య, బండోజు గణేష్ల కుటుంబాలకు బీఆర్ఎస్ నుంచి 50 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సభల కోసం మద్యం ఏరులై పారించి అతి వేగంగా వెళుతున్న మీ వాహనాలు నిండు ప్రాణాలను తీశాయని, తక్షణమే బీఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబాలను ఆదుకోవాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. ఎల్కతుర్తి, చింతలపల్లి శివారులో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగింది.

2023 డిసెంబర్‍లో కాంగ్రెస్‍ అధికారంలోకి వచ్చాక బీఆర్‍ఎస్‍ చీఫ్ కేసీఆర్ బయటకు రావడానికి అంతగా ఇష్టపడలేదు. పార్టీ మీటింగ్స్ మొదలు అసెంబ్లీ సమావేశాల వరకు హాజరు కాలేదు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాగా, బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆ పార్టీ నిర్వహించిన మొదటి బహిరంగ సభ ఇదే. ఈ సభతో మళ్లీ జనాల్లోకి రావాలని భావిస్తున్న బీఆర్‍ఎస్‍.. మొదటి నుంచి దీన్ని హైలైట్‍ చేసింది. భారీగా జన సమీకరణ చేసింది.