ఓవర్ స్పీడ్ తో బైక్ అదుపుతప్పి యువకుడు మృతి

ఓవర్ స్పీడ్ తో బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
  • కేపీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ కాలనీ వద్ద కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి యువకుడు స్పాట్ డెడ్ 

కూకట్​పల్లి, వెలుగు: వేగంగా వచ్చిన బైక్ ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో యువకుడు స్పాట్ లో చనిపోయాడు. కేపీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్ చంద్రానాయక్ నగర్ లో నివసించే యెండ ప్రదీప్ (25) హఫీజ్​పేటలోని కోకాకోలా గోడౌన్​లో పని చేస్తుంటాడు. ప్రదీప్ శనివారం రాత్రి డ్యూటీకి వెళ్లాడు.  తిరిగి ఆదివారం ఉదయం 3.30 సమయంలో బైక్​ మీద ఇంటికి వెళుతుండగా..  కేపీహెచ్​బీ కాలనీ ఇందు ఫార్య్చూన్​ వద్ద ఓవర్ స్పీడ్ తో  బైక్​ అదుపు తప్పి ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాత్ మీద ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో  ప్రదీప్‌‌కి  తీవ్రగాయాలై స్పాట్ లోనే చనిపోయాడు.  డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకుని కేపీహెచ్​బీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.