- ప్రాణాలు తీస్తున్న ఓవర్‌స్పీడ్.. రోజూ 20కి పైగా యాక్సిడెంట్స్
- సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్యే అత్యధికం
- చనిపోతున్న వారిలో 90 శాతం టూవీలర్స్వాళ్లే
- మూడేండ్లలో 11వేలకు పైగా మరణాలు
- -నిరుడు రాష్ట్ర వ్యాప్తంగా 3,574 మంది మృత్యువాత
- ప్రమాదాల్లో 85 శాతం 28 ఏండ్లలోపు యువతే
- నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల అధిక ప్రమాదాలు
హైదరాబాద్, వెలుగు: హై స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ రాష్ట్ర రోడ్లపై డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. యువత మితిమీరిన వేగం.. వారితోపాటు ఎదుటి వారి ప్రాణాలను బలిగొంటున్నది. రోజుకు సగటున 20కి పైగా యాక్సిడెంట్స్జరుగుతుండగా.. ఈ ప్రమాదాల్లో 90 శాతం మంది ద్విచక్రవాహనదారులే బాధితులుగా ఉంటున్నారు. గత మూడేండ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా 26,374 రోడ్డు ప్రమాదాలు జరుగగా.. 11,031 మంది మృతి చెందారు. 27,549 మంది గాయపడ్డారు.
గతేడాది 3,574 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 90 శాతం ప్రమాదాలు అతివేగంతోనే జరిగినట్టు రోడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అతివేగం, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌తో 8,558 బైక్ యాక్సిడెంట్స్ జరిగాయి. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య సమయంలోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సమయంలో గత మూడేండ్ల వ్యవధిలో 5,923 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
మైనర్లు, 28 ఏండ్లలోపు యువతే ఎక్కువ
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా యువత ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదు. ప్రతి ఏటా వందల మంది ద్విచక్ర వాహనదారులు క్షతగాత్రులు అవుతుండగా.. వందకు తగ్గకుండా యువత ప్రాణాలు కోల్పోతున్నది. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో పాటు హెల్మెట్ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణాలని పోలీస్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి ఏటా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనదారులే బాధితులుగా ఉంటుండగా.. ఇందులో మైనర్లు, 28 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న యువకులే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు.
నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తున్నది..
రోడ్ సేఫ్టీపై పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా వాహనదారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీని పర్యవసానంగా రాష్ట్రంలోని స్టేట్ హైవేస్‌తో పాటు జాతీయ రహదారులు రక్తసిక్తం అవుతున్నాయి. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎప్పటిలాగే రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది. ఆ తర్వాతి స్థానంలో వరంగల్ నిలిచింది. రోడ్‌సేఫ్టీ రూల్స్ పాటించకుండా డ్రైవింగ్ చేయడమే ప్రమాదాలకు కారణమని పోలీస్ గణాంకాలు చెబుతున్నాయి. నిర్లక్ష్యంగా వెహికల్ డ్రైవ్ చేస్తూ తమతో పాటు పాటు ఎదుటి వారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. బైక్ జర్నీ డెత్స్ ఎక్కువగా ఉండడం వాహనదారులను కలవర పెడుతున్నది.
ప్రమాద కారణాలు
ఓవర్ స్పీడ్ ర్యాష్డ్రైవ్ డ్రంకన్ డ్రైవ్ రాంగ్‌సైడ్ సిగ్నల్ ఫోన్‌చూస్తూ జంపింగ్ డ్రైవ్
5,867 3,813 297 192 27 12
5,817 3,532 120 237 22 21
6,693 3,280 153 279 48 8
18,377 10,625 570 708 97 41
ప్రమాదాలకు గురైన వెహికల్స్
బైక్స్ కార్లు ఆటోలు బస్సులు ట్రక్, లారీ సైకిల్స్ ఇతర వాహనాలు
3,022 2,645 648 646 1,986 13 1,248
2,660 2,616 558 632 1,969 03 1,301
2,876 2,898 582 642 1,923 03 1,537
8,558 8,159 1,788 1,920 5,878 19 4,086
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రమాదాల వివరాలు
సంవత్సరం ప్రమాదాలు మృతులు గాయపడ్డవారు
2022 8,968 3,880 9,399
2023 8,390 3,577 8,699
2024 9,016 3,574 9,451
మొత్తం 26,374 11,031 27,549