రెండు ప్రమాదాల్లో నలుగురు మృతి.. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో విషాదం

రెండు ప్రమాదాల్లో నలుగురు మృతి.. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో విషాదం
  • నల్గొండ జిల్లాలో బైక్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టిన కారు
  • యువకుడితో పాటు అతడి అన్న కొడుకు మృతి
  • మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ ట్రాలీ పల్టీ కొట్టి ఇద్దరు రైతులు మృతి

దేవరకొండ (కొండమల్లేపల్లి), వెలుగు: బైక్‌‌‌‌‌‌‌‌ను కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పరిధిలో ఆదివారం జరిగింది. ఎస్సై రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలంలోని బుగ్గ తండాకు చెందిన లూటావత్ భీముడు(23), అతడి అన్న కొడుకు వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ (8)తో కలిసి బైక్‌‌‌‌‌‌‌‌పై నాంపల్లి మండలం రేఖ్యాతండాలోని బంధువుల ఇంటికి వెళ్తున్నారు. 

ఈ క్రమంలో కొండమల్లేపల్లి మండలంలోని చెన్నారం గేట్‌‌‌‌‌‌‌‌ ములమలుపు వద్దకు రాగానే హైదరాబాద్ – నాగార్జునసాగర్ హైవేపై చీరాలకు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ స్పాట్‌‌‌‌‌‌‌‌లోనే చనిపోగా భీముడు తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారులో ఐదుగురు యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రామ్మూర్తి చెప్పారు.

కరెంట్‌‌‌‌‌‌‌‌ పోల్స్‌‌‌‌‌‌‌‌ తరలిస్తుండగాట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ ట్రాలీ బోల్తా పడి..
జడ్చర్ల, వెలుగు : కరెంట్‌‌‌‌‌‌‌‌ పోల్స్‌‌‌‌‌‌‌‌ తరలిస్తుండగా ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ ట్రాలీ బోల్తా పడడంతో ఇద్దరు రైతులు చనిపోయారు. మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా జడ్చర్ల మండలం చిన్నఆదిరాల గ్రామానికి చెందిన రైతులు పి.జంగయ్య(60), ఏదుల జంగయ్య (50) తమ పొలానికి కరెంట్‌‌‌‌‌‌‌‌ సప్లై కోసం విద్యుత్‌‌‌‌‌‌‌‌ పోల్స్‌‌‌‌‌‌‌‌కు అప్లై చేసుకున్నారు. పోల్స్‌‌‌‌‌‌‌‌ మంజూరు కావడంతో వాటిని తీసుకెళ్లేందుకు ఆదివారం గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ను రెంట్‌‌‌‌‌‌‌‌కు మాట్లాడుకొని జడ్చర్లలోని సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌ గోడౌన్‌‌‌‌‌‌‌‌ వద్దకు వెళ్లారు. 

పోల్స్‌‌‌‌‌‌‌‌ను లోడ్‌‌‌‌‌‌‌‌ చేసుకున్న అనంతరం తిరిగి వస్తుండగా గంగాపూర్‌‌‌‌‌‌‌‌ శివారులో ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ అదుపుతప్పడంతో ట్రాలీ పల్టీ కొట్టింది. దీంతో పోల్స్‌‌‌‌‌‌‌‌ మీద పడడంతో పి.జంగయ్య అక్కడికక్కడే చనిపోగా, ఏదుల జంగయ్య తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అతడిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లగా అక్కడ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటూ చనిపోయాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ డ్రైవర్‌‌‌‌‌‌‌‌ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.