Metro Tunneling: మెట్రో టన్నెలింగ్ ఎఫెక్ట్.. ఇండ్ల మధ్య 24 అడుగుల లోతుకు కుంగిన భూమి

Metro Tunneling: మెట్రో టన్నెలింగ్ ఎఫెక్ట్.. ఇండ్ల మధ్య 24 అడుగుల లోతుకు కుంగిన భూమి

జనవాసాల మధ్య ఉన్నట్టుండి కుంగిన భూమి.. పెద్ద రంధ్రం.. ఏం జరుగుతుందో తెలియక స్థానిక జనం పరుగులు.. ఇంకేం జరుగుతుందోననని భయం.. రాత్రి పదిగంటలసమయం.. ఎటు పోవాలో దిక్కుతోచని స్థితి.. ఇది శుక్రవారం రాత్రి ముంబైలోని అంధేరీ ఓ కాలనీ వాసులు పరిస్థితి.. పూర్తివివరాల్లోకి వెళితే.. 

ముంబైలోని అంధేరీ ఈస్ట్ పరిధిలోని సహారారోడ్డు ఎల్ అండ్ టీ కాలనీలో శుక్రవారం (ఆగస్టు 23,2024) రాత్రి 10.30 గంటలకు ఉన్నట్టుంది ఒక్కసారిగా భూమి  24 అడుగుల లోతుకు కుంగింది.. దీంతో జనవాసాల మధ్య గుహలాంటి పెద్ద రంధ్ర ఏర్పడింది.. ఇది చూసిన స్థానిక జనం భయంతో పరుగులు పెట్టారు. ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందారు.. 

ALSO READ | RHUMI 1: నింగిలోకి దూసుకెళ్లిన హైబ్రిడ్‌ రాకెట్‌ "రూమీ1"

ఎల్ అంట్ కాలనీలో మెట్రో టన్నెలింగ్ పనులు జరుగుతున్నాయి.  పనులు జరుగుతున్న సమయంలో కాలనీలో రెండు పక్కల ఇండ్లు ఉండగా నడిరోడ్డుపై పెద్ద రంధ్రం ప్రత్యక్షమయింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే మెట్రో టన్నెలింగ్ తో ప్రమాదాన్ని గుర్తించిన స్థానిక పరిపాలన యంత్రాంగం.. ఆ ప్రాంతంలోని పది కుటుంబాలను మరోచోటికి తరలించారు.