రోడ్డు కుంగి.. ఇటుకల లారీ బోల్తా

జీడిమెట్ల, వెలుగు: సుభాష్​నగర్​డి విజన్ ​సూరారం దయానంద్​ నగర్​కాలనీలో ఆదివారం రోడ్డు కుంగి ఇటుకల లోడుతో వెళ్తున్న లారీ అందులో ఇరుక్కుపోయింది. ఇటీవల ఇక్కడ సీసీ రోడ్డు వేశారు. అయితే అండర్​గ్రౌండ్​డ్రైనేజీ ఉన్న చోట కాంట్రాక్టర్​ప్రత్యేక చర్యలు తీసుకోలేదు. ఆదివారం అటుగా వెళ్తున్న ఇటుకల లారీ బరువుకు రోడ్డు కుంగింది. లారీ అందులో ఇరుక్కుపోయి బోల్తా పడింది. పక్కనే ఉన్న కరెంట్​స్తంభం, ఇంటిపై వాలింది. కరెంట్​స్తంభం సగానికి విరిగింది. ఆ టైంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అండర్​గ్రౌండ్​డ్రైనేజీ లైన్​ధ్వంసమైంది.