రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల రహదారిలో రెండు కార్లు ఢీకొనడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గంగాధరలో ఓ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడు కరీంనగర్ వావిలాల పల్లికి చెందిన అజయ్(40)గా గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.