
గండిపేట్, వెలుగు : బండ్లగూడ జాగీరు కిస్మత్పూర్లో కారు అదుపుతప్పి కరెంట్ ట్రాన్స్ ఫార్మర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో అందులోని వారికి పెను ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు గమనించి బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు.
పొగమంచుతో రోడ్డు కనిపించని కారణంగానే శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు రాజేంద్రనగర్పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.