
భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీ కొనడంతో నలుగురు యువకులు దుర్మరణం చెందారు. ఇల్లెందు- మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సమీపంలో ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. స్పాట్ లో ముగ్గురు మృతి చెందగా మరొకరు ఇల్లెందు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా హనుమకొండ జిల్లా కమలాపూర్ కు చెందిన అరవింద్, వరంగల్‌కు చెందిన రాము, కల్యాణ్, శివగా గుర్తించారు. వీరంతా ప్రీ వెడ్డింగ్ షూట్ కు మోతేకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.