డీసీఎంను ఢీకొట్టిన బస్సు

  •     20 మందికి స్వల్ప గాయాలు
  •     మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా జడ్చర్ల మండలంలో ఘటన

జడ్చర్ల, వెలుగు: మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా జడ్చర్ల మండలం బూరెడ్డిపల్లి సమీపంలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ – బెంగళూర్‌‌‌‌‌‌‌‌ హైవేపై ఆదివారం అర్ధరాత్రి ఆర్టీసీ సూపర్‌‌‌‌‌‌‌‌ లగ్జరీ బస్సు, డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ఏపీకి చెందిన సూపర్‌‌‌‌‌‌‌‌ డీలక్స్‌‌‌‌‌‌‌‌ బస్సు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి 36 మంది ప్రయాణికులతో ధర్మవరం వెళ్తోంది. జడ్చర్ల మండలం బూరెడ్డిపల్లి చౌరస్తా వద్దకు రాగానే యూటర్న్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్న డీసీఎంను ఢీకొట్టింది. 

దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన ప్రయాణికులు వెంటనే కిందకు దిగడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఘటనలో 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న టౌన్‌‌‌‌‌‌‌‌ సీఐ ఆదిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేయగా అప్పటికే బస్సు పూర్తికా కాలిపోయింది. గాయపడిన ప్రయాణికులను జిల్లా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు.