నల్గొండలో విషాదం..చనిపోయిన వ్యక్తిని చూసేందుకు వెళ్లిన మరో నలుగురు మృతి

నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డుప్రమాదంలో మృతిచెందిన కుటుంబ సభ్యుడిని  చూసేందుకు వెళ్లిన వ్యక్తులను మరో మృత్యువు మింగేసింది.  వెంపాడ్  స్టేజీ వద్ద ఏడుగురితో వెళ్తున్నఆటో నూ ఆయిల్ ట్యాంకర్ ఢీకొనటంతో నలుగురు అక్కడిక్కడే చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది. వీరిని హాస్పిటల్ కు  తరలించి ట్రీట్మెంట్  అందిస్తున్నారు. 

డిసెంబర్ 24 ఆదివారం రాత్రి 10  గంటల టైమ్ లో రోడ్ పై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఐతే ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని చూసేందుకు బంధువులు ఆటోలో వెళ్తుండగా ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. రెండు ప్రమాదాలతో తీరని విషాదం నెలకొంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులను రమావత్ కేశవులు, గణ్య, నాగరాజు, పాండ్య, బుజ్జిగా గుర్తించారు.