మేడ్చల్: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. మండల కేంద్రంలోని లలిత కన్వెన్షన్ హాల్ సమీపంలో అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన హరిప్రియ, రాబిన్, పిలిప్ లను చికిత్స కోసం కీసర లైఫ్ సేవ్ హాస్పిటల్ కు తరలించారు.
మృతులు అల్వాల్ లోని లోతుకుంట ప్రాంతానికి చెందిన భవేష్, త్రిశూరగా గుర్తించారు. కీసర నుంచి అల్వాల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.