ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఏపీ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు, బైక్, ట్రాక్టర్ ఢీ కొనడంతో నలుగురు చనిపోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. మొగలి ఘాట్ దగ్గర ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులో బ్రేక్ ఫెయిల్ అయి ఒక లారీ... ముందు వెళ్తున్న మరో లారీని ఢీకొట్టింది. 

ఈ రెండు లారీలు ముందు వెళ్తున్న బైక్ , ట్రాక్టర్ ను కొట్టాయి. మృతులను బంగారుపాళ్యం, కీరమంద గ్రామాలకు చెందినవారిగా గుర్తించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు.  ప్రమాదంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.