- డీసీఎం, క్రేన్లు తెచ్చి మరీ ఎత్తుకెళ్తున్నరు
- ముఠా సభ్యుల్లో నలుగురు అరెస్ట్
జీడిమెట్ల, వెలుగు: రోడ్డు రోలర్స్దొంగలించి స్క్రాప్చేసి విక్రయిస్తున్న ముఠా సభ్యుల్లోని నలుగురిని జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను బాలానగర్డీసీపీ సురేశ్‌కుమార్ గురువారంవెల్లడించారు. కర్నాటకకు చెందిన అఫ్రోజ్హమ్మద్పటేల్ (24), జహీరాబాద్‌కు చెందిన మహ్మద్ఇబ్రహీం(31) బాలానగర్రాజుకాలనీలో ఉంటున్నారు.
అఫ్రోజ్గ్యాస్కట్టింగ్ పని చేస్తుండగా, ఇబ్రహీం స్ర్కాప్బిజినెస్ చేస్తున్నాడు. విలాసాలకు అలవాటు పడి కుత్బుల్లాపూర్‌కు చెందిన డీసీఎం ఓనర్కమ్డ్రైవర్షేక్ అన్వర్(35) తో కలిసి గ్యాంగ్‌గా ఏర్పడి చోరీలు చేస్తున్నారు. అయితే, ఈ నెల 20న బాలానగర్‌కు చెందిన రోడ్డు రోలర్డ్రైవర్ బి.లక్ష్మన్(40) శివశక్తి టింబర్‌డిపో వద్ద పనిచేసి, తన వాహనాన్ని జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలోపార్క్చేసి ఇంటికి వెళ్లాడు. 21న ఉదయం వచ్చి చూసేసరికి రోడ్డు రోలర్ కన్పించకపోవడంతో జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డీసీఎం మొరాయించడంతో బయటపడ్డ బాగోతం..
రోడ్డు రోలర్వద్ద ఎవరూ లేరన్న విషయాన్ని అఫ్రోజ్అహ్మద్ నిర్ధారించుకొని ఈ విషయాన్ని షేక్‌అన్వర్, ఇబ్రహీంకు తెలిపాడు. అనంతరం కుత్బుల్లాపూర్‌కు చెందిన క్రేన్ఓనర్కమ్ఆపరేటర్బలరామ్ సత్యనారాయణ (47) వద్ద రెండు క్రేన్ లు, డీసీఎంను రోడ్డు రోలర్పార్క్చేసిన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం రెండు క్రేన్లతో రోడ్డు రోలర్‌ను డీసీఎంలో ఎక్కించి దొంగలించారు. దీనిని జహీరాబాద్తీసుకెళ్లి స్క్రాప్ చేయాలని ప్లాన్ వేశారు.
రెండు కిలోమీటర్ల వెళ్లగానే, డీసీఎం మొరాయించడంతో అక్కడే వదిలేసి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు 64 సీసీ కెమెరాలను పరిశీలించి, అఫ్రోజ్అహ్మద్, ఇబ్రహీం, షేక్‌అన్వర్, సత్యనారాయణను గురువారం అరెస్ట్‌చేశారు. ఈ కేసులో సయ్యద్‌ముస్తాఫా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పేట్‌బషీరాబాద్ పరిధిలోనూ నిందితులు ఇలాగే ఒక రోడ్డు రోలర్‌ను దొంగలించి స్క్రాప్ చేసి విక్రయించినట్లు గుర్తించారు. సమావేశంలో ఏసీపీ హనుమంతరావు, సీఐ గడ్డం మల్లేశ్, డీఐ కనకయ్య పాల్గొన్నారు.