లక్ష్మణచాంద, వెలుగు: ఆర్టీసీ ఆధ్వర్యంలో లక్షణచాంద మండల కేంద్రంలో శనివారం రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ప్రతిమా రెడ్డి మాట్లాడుతూ.. వాహనాలు నడిపేవారు అన్ని నియమనిబంధనలు పాటించాలన్నారు.
మనపై కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని, వాహనాలు జాగ్రత్తగా నడపాలన్నారు. ఆర్టీసీ బస్సుతో ప్రమాదాలు చాలా తక్కువని, బస్సులో ప్రయాణించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఏఎస్సై బి.నారాయణ రెడ్డి,హెడ్ కానిస్టేబుళ్లు శంకర్, వాహిద్, అశోక్, ఆర్టీసీ సిబ్బంది టీవీ రమణ, దేగం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.