వెలుగు, మెహిదీపట్నం: రిపేర్ల కోసం రోడ్డును తవ్వేసి, పనులు ఆలస్యంగా చేస్తుండటంతో నిలోఫర్ ఆస్పత్రికి వచ్చే పేషెంట్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిలోఫర్ ఆస్పత్రి వద్ద నుంచి నాంపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ చౌరస్తా వరకు కొత్త రోడ్డు వేసేందుకు పాత రోడ్డును తవ్వేసి అలాగే వదిలేశారు. నడిచేందుకు వీలు లేకుండా ఇష్టారీతిన రోడ్డును తవ్వడంతో ఆస్పత్రికి వచ్చే చిన్నారులు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. గ
ర్భిణులను వీల్ చైర్లో తీసుకెళ్దామన్నా.. రోడ్డుపై ఉన్న కంకర కారణంగా వీల్ చైర్ ముందుకు వెళ్లలేని పరిస్థితి. జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆస్పత్రి డాక్టర్లు పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఆస్పత్రి ముందు రోడ్డు రిపేర్ పనులను పూర్తి చేయాలని పేషెంట్ల బంధువులు, డాక్టర్లు కోరుతున్నారు.