కేటీఆర్ శంకుస్థాపన చేసి రెండేళ్లయినా పనులు షురూ కాలే

కేటీఆర్ శంకుస్థాపన చేసి రెండేళ్లయినా పనులు షురూ కాలే

విస్తరణకు నోచుకోని షాద్ నగర్ ఓల్డ్ హైవే

13 కిలోమీటర్ల మేర 67 కోట్లతో నిర్మాణం
యాక్సిడెంట్లు అయితున్నా పట్టించుకోని అధికారులు
సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న షాద్ నగర్ జనం

షాద్ నగర్, వెలుగు: ఓల్డ్​నేషనల్​హైవే విస్తరణకు మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేసి రెండేళ్లు దాటినా ఇంకా పనులు మొదలుకాలేదు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమో ఏమో కానీ ఇంతవరకు విస్తరణ పనులను చేపట్టడడం లేదు. ఫండ్స్​ మంజూరైనా పనులు మాత్రం ప్రారంభించడం లేదు. కిలో మీటర్ల మేర రోడ్డుపై గుంతలతో బ్రిడ్జిలు, కల్వర్టుల వద్ద ప్రమాదకరంగా ఉంది.  ప్రతిరోజూ ఏదో ఓ చోట యాక్సిడెంట్​అవుతుంది.  దీనిపై సోషల్ మీడియాలో షాద్​నగర్​ ప్రజలు మంత్రిని ప్రశ్నిస్తున్నారు.  షాద్ నగర్ సెగ్మెంట్​లోని ఓల్డ్​ నేషనల్​హైవే కొత్తూరు నుంచి సోలిపూర్ వరకు13 కిలో మీటర్లు ఉంది. ఒక్కప్పుడు హైవేలో  భాగంగా ఉండేది. కొత్తూరు , నందిగామ, చంద్రయాన్ గూడ ,లింగారెడ్డి గూడ, షాద్ నగర్, సోలీపూర్ ల మీదుగా రోడ్డు వెళ్తుంది. షాద్ నగర్ కు బై పాస్ రోడ్డు వేయడంతో ఓల్డ్​ హైవేని పాలకులు పట్టించుకోవడం మానేశారు. ఎన్నికలప్పుడు 2018 సెప్టెంబర్ 5న మంత్రి కేటీఆర్ రూ. 67 కోట్లతో విస్తరణకు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేశారు.  కొత్తూరు ఇండస్ట్రియల్​ఏరియా కావడంతో షాద్ నగర్ టౌన్​వరకు రోడ్డు వెంట చాలా కంపెనీలు ఉన్నాయి. కార్మికులు , కంపెనీల యజమానులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు పై తరచూ ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్​అవుతూనే ఉంది. రాత్రి వేళ వెళ్లాలంటే రోడ్డుపై  ఏ గుంతలో పడి ప్రాణాలు కోల్పోతామోనని వాహనదారులు భయంగా వెళ్తుంటారు.

ప్రమాదకర ప్రదేశాలు ఇవే  

కొత్తూరు వంతెనపై రోడ్డు గుంతలు గా మారింది.  పరిశ్రమలకు వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై గుంతల్లో మురుగునీరు పారుతూ కంపుకొడుతుంది. నందిగామ వద్ద నిర్మించిన వంతెన రెయిలింగ్​కూలిపోయి ప్రమాదకర ఉంది. వాహన దారులు ఆదమరిస్తే ప్రమాదం జరిగే అవకాశం నెలకొంది.   ఇక్కడ అధికారులు సూచిక బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. రోడ్డు మొత్తం గుంతలమయంగా ఉంటుంది.   ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.

యాక్సిడెంట్స్ అయితున్నయ్

మంత్రి కేటీఆర్ వచ్చి ఓల్డ్​ హైవే పనులకు శంకుస్థాపన చేసి రెండేళ్లు దాటింది. ఇప్పటి వరకు విస్తరణ చేయలేదు. రోడ్డుపై ప్రతిరోజు యాక్సిడెంట్లు అవుతున్నా పట్టించుకునే వారే లేరు. టీఆర్ఎస్ ప్రభుత్వానివి మాటలే తప్ప చేతల్లో చూపడం లేదు. అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా స్పందించి రోడ్డు విస్తరణ పనులు వెంటనే ప్రారంభించాలి.

–సుధాకర్, నందిగామ మండల బీజేపీ అధ్యక్షుడు

ప్యాచ్​వర్క్​లకు ఫండ్స్​ రిలీజ్​

కొత్తూరు నుంచి సోలీపూర్ వరకు ఓల్డ్​ హైవే విస్తరణకు అడ్మినిస్ట్రేషన్ నుంచి శాంక్షన్​ మాత్రమే అయ్యింది.  టెక్నికల్​గా పెండింగ్​లో ఉంది. ప్రస్తుతానికి రోడ్డుపై గుంతల ప్యాచ్​వర్క్​లకు రూ. 2 కోట్ల 95 లక్షలకు రిలీజ్​అయ్యాయి. రెండు మూడు రోజుల్లో టెండర్ వేసే అవకాశం ఉంది. పూర్తవగానే వెంటనే బీటీ పనులను మొదలు పెడతాం.

– రాజశేఖర్, ఏఈ, ఆర్అండ్‌బీ

For More News..

అప్పుడే 20 జిల్లాల్లో యూరియా నోస్టాక్

క్రికెట్‌ను వదిలి.. వరల్డ్​లోనే రిచెస్ట్​​ బ్యాంకర్‌గా మారి..‌