రోడ్లు అభివృద్ది: ఆర్​ అండ్​ బీ శాఖకు ఫండ్స్​ ఎలాట్​మెంట్​

రోడ్లు అభివృద్ది: ఆర్​ అండ్​ బీ శాఖకు ఫండ్స్​ ఎలాట్​మెంట్​
  • కొత్త రోడ్లు.. ఫ్లై ఓవర్లు నిర్మిస్తాం
  • ఆర్అండ్ బీకి రూ.5,907 కోట్లు కేటాయింపు
  • పాత రోడ్లను రిపేర్​లకు బడ్జెట్​ లో నిధులు

హైదరాబాద్, వెలుగు: రోడ్ల అభివృద్ధికి బడ్జెట్​లో రూ.5,970 కోట్లు కేటాయించారు. కొత్త రోడ్లు, ఫ్లై ఓవర్ల నిర్మాణం, పాత రోడ్ల రిపేర్లకు ప్రభుత్వం ఈ నిధులు ఖర్చు చేయనున్నది. గత బడ్జెట్​తో పోలిస్తే రూ.100 కోట్లు అదనంగా కేటాయించారు. మొత్తం నిధుల్లో రూ.3,725.22 కోట్లతో 769.35 కిలో మీటర్ల కొత్త రోడ్లు వేయనున్నారు. 

ఇందులో ఇప్పటికే 55 కి.మీ రోడ్డు, 5 ఫ్లై ఓవర్ల నిర్మాణం పూర్తి చేశారు. 2028 నాటికి హమ్ (హైబ్రిడ్ యాన్యూటి మోడ్) ద్వారా రూ.28,000 కోట్లతో 17,000 కిలోమీటర్ల రోడ్లను నిర్మించనున్నారు. ఇందులో ప్రభుత్వం 40 శాతం, మిగిలిన 60 శాతం ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఖర్చు చేయనున్నారు. 

ప్రతి గ్రామ పంచాయతీకి బీటీ రోడ్డు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. 12 జిల్లా కేంద్రాల్లో రూ.972 కోట్లతో కోర్టు బిల్డింగ్ నిర్మించనున్నారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి బడ్జెట్​లో రూ.1,525 కోట్లు కేటాయించారు. భూసేకరణ, పరిహారం చెల్లింపులకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. ట్రిపుల్ ఆర్ నార్త్ పార్ట్​కు టెండర్ల గడువు ముగిసింది. 

త్వరలో టెండర్లు ఓపెన్ చేయనున్నారు. సౌత్ పార్ట్ డీపీఆర్ తయారీకి కన్సల్టెంట్​ను నియమించారు. రాజేంద్రనగర్​లో 100 ఎకరాల్లో నిర్మించనున్న కొత్త హైకోర్టు భవనాలకు రూ.2,700 కోట్లు కేటాయించారు. నిర్మాణంలో ఉన్న కొత్త కలెక్టరేట్లకు రూ.300 కోట్లు అలాట్​ చేశారు. మామూనూరు ఎయిర్‌‌‌‌పోర్టుకు రూ.205 కోట్లు కేటాయించారు.