ఇది రోడ్డా.. చెరువా?: గుంతలతో.. ప్రయాణం ఎలా?

ఇది రోడ్డా.. చెరువా?: గుంతలతో.. ప్రయాణం ఎలా?

ఇది రోడ్డా.. చెరువా?

ఏఎస్​రావు నగర్​ మెయిన్​ రోడ్డుపై మురుగు పొంగి పొర్లుతోంది. వాహనదారులు, వాకర్స్​ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమీపంలోని పెట్రోల్ బంక్​యజమాని దారికోసం నాలాపై స్లాబ్​వేయడంతో డ్రైనేజీ జామ్ ​అయ్యింది. మురుగు రోడ్డుపై ప్రవహించడంతో చెరువును తలపిస్తోంది. బంక్​ యజమానిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.                                         – కుషాయిగూడ, వెలుగు

గుంతల రోడ్డు.. ప్రయాణం ఎలా?

శంషాబాద్ నుంచి కొత్వాల్ గూడ వెళ్లే మెయిన్​రోడ్డు అధ్వానంగా తయారైంది. రహదారిపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. కాంట్రాక్టర్​నిర్లక్ష్యం వాహనదారులకు శాపంగా మారింది. ఆ గుంతల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు.   – శంషాబాద్, వెలుగు