- చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- క్యాతనపల్లి ఆర్వోబీ పనుల పరిశీలన
- పనుల జాప్యంపై ఆఫీసర్లు, కాంట్రాక్టర్‌పై ఆగ్రహం
కోల్‌బెల్ట్/చెన్నూరు/జైపూర్, వెలుగు: రామకృష్ణాపూర్–మంచిర్యాల ప్రధాన రహదారి క్యాతనపల్లి రైల్వే ఓవర్‌బ్రిడ్జి పనులను మూడు నెలల్లో పూర్తి చేయించనున్నట్లు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్
వెంకటస్వామి తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన ఆర్అండ్బీ ఆఫీసర్లు, కాంట్రాక్టర్, కాంగ్రెస్ లీడర్లతో కలిసి ఆర్వోబీ పనులను పరిశీలించారు. పనుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యంపై అధికారులు, కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్వాలిటీలో రాజీపడొద్దని, నాణ్యతగా నిర్మించాలని ఆదేశించారు. వర్క్ ప్రోగ్రెస్‌ను ప్రతిరోజు తనకు పంపాలని, 15 రోజులకు ఒకసారి వచ్చి పనులను పరిశీలిస్తానని చెప్పారు. భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. అనంతరం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని సాయికుటీర్‌లో మిషన్ భగీరథ పైపులైనును పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట ఆర్అండ్బీ ఈఈ నర్సింహాచారి, మనోజ్, కృష్ణ, క్యాతనపల్లి మున్సిపల్మేనేజర్నాగరాజు, కాంగ్రెస్ లీడర్లు రాఘునాథ్‌రెడ్డి, ఓడ్నాల శ్రీనివాస్, రాజయ్య, మహంకాళి శ్రీనివాస్, యాకుబ్‌అలీ తదితరులున్నారు.
క్రైస్తవ కుటుంబాలకు గిప్ట్‌ల పంపిణీ
క్రిస్మస్ పండుగ నేపథ్యంలో క్రైస్తవ కుటుంబాలకు సర్కార్ ఇస్తున్న బట్టలు, గిప్ట్లను చెన్నూరు పట్టణంలోని షాదీఖానా ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోసం క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన కోటపల్లి మండలం పారిపెల్లి గ్రామంలో కాలభైరవ స్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. చెన్నూరు మండలం లక్ష్మీపూర్‌లో గిరిజన ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు.
సోమన్‌పల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. చెన్నూరులోని క్యాంప్ ఆఫీస్ లో జరుగుతున్న రిపేర్లను పరిశీలించి పనులు తొందరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, చెన్నూరు మున్సిపల్ చైర్పర్సన్ అర్చనా గిల్డా, మందమర్రి, చెన్నూరు, జైపూర్ఎంపీపీలు మంగ, మంత్రి బాపు, రమాదేవి, జడ్పీటీసీలు రవి, తిరుపతి, సునీత, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ మూల రాజిరెడ్డి, పలు విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.