
గ్రేటర్ పరిధిలో దోపిడీ దొంగల ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఇళ్లు, బ్యాంకులు, బస్సులు, షాపింగ్ మాల్స్.. దొంగతనానికి ఏదీ మినహాయింపు కాదు అన్నట్లుగా లేటెస్ట్ గా గొర్ల మందపై గురిపెట్టారు. మటన్ కు ఉన్న డిమాండ్ దృష్ట్యా గిట్టుబాటు బాగా అవుతుందని భావించినట్లుంది. హయత్ నగర్ లో శివారు ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులపై కత్తులతో దాడి చేసి 30 గొర్రెలను దొంగిలించి పారిపోయారు.
దుండగులు గొర్రెలను దొంగిలిస్తున్న సమయంలో గొర్లకాపర్లుగా ఉన్న యువకులు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ చెలరేగింది. ఈ దాడిలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న కానిస్టేబుల్ నవీన్ కు తీవ్ర గాయాలయ్యాయి. తన తండ్రికి ఆరోగ్యం బాగలేకపోవడంతో గొర్రెల మంద వద్ద తన బంధువుతో కలిసి కావలిగా ఉన్నాడు కానిస్టేబుల్ నవీన్.
ఆదివారం (ఏప్రిల్ 27) రాత్రి మూడు గంటల సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్ నవీన్ తండ్రి ఒంటరిగా ఉండటం గమనించిన దొంగలు పక్కా ప్లాన్ ప్రకారం దోపిడీ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు...