ఏటీఎంల ట్యాంపరింగ్.. క్యాష్ డిస్పెన్సరీ కియాస్క్ ద్వారా చోరీ

అరచేతిలో ప్రపంచాన్ని చుట్టేసే టెక్నాలజీ  మన సొంతం. ఒకప్పుడు డబ్బులు కావాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఆ తర్వాత ఏటీఎంల ద్వారా క్యాష్ విత్ డ్రా చేసుకుంటున్నాం. ఐతే ఇదే అదునుగా చేసుకుంటున్న కొందరు కేటుగాళ్లు నయా సైబర్ దందాకు తెరలేపారు. జనాలకు టోకరా వేస్తే ఏం సంపాదిస్తాం  అనుకున్నారో ఏమో.. బ్యాంకులకే టోకరా వేయడం మొదలుపెట్టారు. ఏకంగా ఏటీఎంలకే ఎర్త్ పెట్టారు. క్యాష్ డిస్పెన్సరీ కియాస్క్ నుంచి డబ్బులు బయటకు రాకుండా దోచుకున్నారు

వివరాల్లోకి వెళ్తే..ముంబై లో  ఏటీఎం మిషన్‌ను ట్యాంపరింగ్ చేసిన దుండగులు.. నగదును దోచుకెళ్లారు.  బ్యాంక్ కంట్రోల్లో ఉండే ఏటీఎంలను తమ గుప్పెట్లో పెట్టుకొని క్రైమ్ సీన్ నడిపించారు. నిందితులు ఏటీఎం  క్యాష్ డిస్పెన్సర్ స్లాట్‌లో ఫ్లాట్ నగదు బయటకు రాకుండా అడ్డుగా కొన్ని వస్తువులను దూర్చారు. ఏటీఎం వినియోగ దారులు  క్యాష్ డ్రా చేసుకున్న తరువాత.. నగదు బయటకు రాకుండా అడ్డుకున్నాయి.   అయితే మెషీన్‌లో  లోపం ఉంటుందని భావించి కస్టమర్లు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో...  అక్కడే కాచుకొని కూర్చున్న దుండగులు నగదు పంపిణీ చేసే స్లాట్‌లో ఉన్న వస్తువును తొలగించి నగదు తీసుకుని పరారయ్యారు.

ఒక్కోసారి మిషన్ లో లోపం ఉన్నప్పుడు .. నగదు మళ్లీ వారి ఖాతాలో జమ అవుతుంది.  జమ కాకపోవడంతో ఖాతాదారులు బ్యాంకును ఆశ్రయించారు.  బాధితుల ఫిర్యాదు మేరకు  ట్యాంపరింగ్ ద్వారా నగరంలోని చాలా ఏటీఎంలలో నగదు కాజేసినట్లు గుర్తించారు. దీంతో  సోమవారం ( మే 29)నప్రైవేట్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు  చేశారు. 

నేరపూరిత కుట్ర

మే 5న, బ్యాంక్ మానిటరింగ్ సెల్ నుంచి  ఏప్రిల్ 28, 29 మరియు మే 02 తేదీల్లో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ATM మెషీన్‌ను ట్యాంపరింగ్ చేశారని  ఇమెయిల్‌ పోలీసులకు వచ్చింది.  ఏప్రిల్ 28న రాత్రి 8:45 నుంచి 9:05 వరకు, ఏప్రిల్ 29న రాత్రి 9:40 నుంచి 10 గంటల మధ్య, మే 02న రాత్రి 11:15 నుంచి 11:30 గంటల మధ్య సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు.  ఏటీఎం మెషీన్‌లో  క్యాష్ డిస్పెన్సరీలో వస్తువులను దూర్చిన..  గుర్తు తెలియని వ్యక్తుల కోసం మలాడ్ పోలీసులు నిఘా పెట్టారు.  కొంతమంది  అనుమానితులు ఏటీఎంలో   నగదు విత్‌డ్రా చేసిన తరువాత బయటకు రాకుండా  క్యాష్ డిస్పెన్సర్ స్లాట్‌లో కొన్ని  వస్తువును చొప్పించినట్లు సీసీ ఫుటేజ్ లో రికార్డైంది.  ఏప్రిల్ 28న ₹3,000, ఏప్రిల్ 29న ₹500, మే 02న ₹1,000 దొంగిలించారు.నిందితులపై  ఐపీసీ సెక్షన్‌లు 34 (రాబరీ), 420 (మోసం చేయడం ), 427 (నష్టం కలిగించే చర్యలు)  సెక్షన్‌లు 65 (టాంపరింగ్ చేయడం)  కంప్యూటర్ మూల పత్రాలు), సమాచార సాంకేతిక చట్టం  66 (కంప్యూటర్ సంబంధిత నేరాలు) కింద కేసు నమోదు చేశారు.