ఏటీఎం చోరీ రొటీన్ గా వింటూనే ఉంటాం.. ఏటీఎం పగలగొట్టలేక వదిలేసి వెళ్లే సంఘటనలు కూడా చూస్తుంటాం.. ఈ ఇన్సిడెంట్ మాత్రం మైండ్ బ్లోయింగ్.. ఏకంగా ఏటీఎం మెషీన్ ఎత్తుకెళ్లిపోయారు.. ఏటీఎం సెంటర్ లో రాత్రి ఉన్న మెషీన్.. ఉదయానికి లేదు.. ఏకంగా మెషీన్.. మెషీన్ మొత్తాన్ని ఎత్తుకెళ్లిపోయారు దొంగలు.. ఈ ఘటన ఎక్కడో జరిగింది కాదు.. మన తెలంగాణలో కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కేంద్రంలో జరిగింది. 2024, జూలై 8వ తేదీ అర్థరాత్రి జరిగిన ఈ దోపిడీ.. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బిచ్కుంద మండల కేంద్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. SBI బ్యాంక్ ఉంది. బ్యాంక్ ఆవరణలోనే.. ఏటీఎం సెంటర్ ఉంది. అందులో ఓ ఏటీఎం మెషీన్ ఉంది. 2024, జూలై 8వ తేదీ రాత్రి వరకు ఏటీఎం సెంటర్ లో మెషీన్ ఉండగా.. 9వ తేదీ ఉదయానికి మెషీన్ మాయం అయ్యింది. సెంటర్ తలుపులు పగలగొట్టి.. అద్దాల డోర్లు విరగొట్టి మరీ మెషీన్ ఎత్తుకెళ్లారు దోపిడీదారులు. సీసీ కెమెరాలు సైతం పగలగొట్టారు కేటుగాళ్లు.
మెషీన్ ఎత్తుకెళ్లటానికి మామూలు వాహనాలు సరిపోవు.. పెద్ద వెహికల్ ఉండాల్సింది. మండల కేంద్రం మెయిన్ రోడ్డులోనే ఉన్న బ్యాంక్ ఆవరణలోని ఏటీఎం సెంటర్ పగలగొట్టి.. ధ్వంసం చేసి మరీ ఏటీఎం మెషీన్ ఎత్తుకెళ్లటం సంచలనంగా మారింది. బ్యాంక్ అధికారుల కంప్లయింట్ తో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలు దోపిడీదారుల కోసం గాలిస్తున్నాయి. బ్యాంక్ ఆవరణలోని సీసీ కెమెరాలతోపాటు.. చుట్టుపక్కల సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.