తాళం వేసిన ఇంట్లో చోరీ

తాళం వేసిన ఇంట్లో చోరీ

భిక్కనూరు, వెలుగు: భిక్కనూరు మండలం భాగిర్తిపల్లి గ్రామంలో మంగళవారం తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు బంగారు, నగదు మొత్తం కలిపి రూ.5లక్షల మేరకు నష్టం జరిగినట్లు సీఐ సంపత్​,ఎస్​ఐ సాయికుమార్​తెలిపారు.

ALSO READ :- విశ్వకర్మ స్కీమ్‌పై అవగాహన పెంచుకోవాలి : రాజీవ్‌ గాంధీ హనుమంతు

గ్రామానికి చెందిన నీల కుమార్​ బీసీ కాలనీలో నివసిస్తున్నాడు. సోమవారం ఉదయం తన ఇంటికి తాళం వేసి తన భార్య నవీనతో కలిసి పొలం దగ్గరికి వెళ్లాడు. అనంతరం రాత్రి ఇంటికి వచ్చి నిద్రపోయారు. కాగా బీసి కాలనీలో సోమవారం రాత్రి ఇంటి తాళం పగలగొట్టి బంగారం, నగదు ఎత్తికెళ్లారు. కుమార్​ ఉదయం ఇంటికి వచ్చి చూసి పోలీసులకు  సమాచారమిచ్చారు.