- రూ. 12.70 లక్షలతో ఉడాయించిన మేనేజర్
కోదాడ, వెలుగు : పెట్రోల్ బంక్‌లో చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనే పోలీసు శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో అనంతగిరి మండలం మొగలాయికోటకు చెందిన వాచేపల్లి హనుమా రెడ్డి మేనేజర్‌గా పని చేస్తున్నాడు. పెట్రోల్, డీజిల్ అమ్మగా వచ్చిన డబ్బులను అతనే బ్యాంక్‌లో జమ చేసేవాడు.
శివరాత్రి సందర్భంగా బ్యాంక్‌కు మూడు రోజులు సెలవులు రావడంతో పెట్రోల్ విక్రయించిన రూ.12.70 లక్షలు అతని వద్దే ఉండిపోయాయి. సోమవారం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అందుబాటులో లేకుండాపోయాడు. గురువారం బంక్ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.