కామారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. అర్థరాత్రి ఏటీఎం చొరబడి చోరీ చేసి చేశారు. ఏటీఎం ధ్వంసం చేసి అందులో ఉన్ నగదు దొంగిలించిన ఘటన కామారెడ్డి జిల్లా పిట్లంలో చోటు చేసుకుంది.
ఆదివారం (జనవరి 12, 2025) తెల్లవారు జామున పిట్లం మండల కేంద్రంలో SBI ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్లతో కట్ చేసి ఏటీఎం మిషన్ ను ఓపెన్ చేశారు ముసుగుతో ఏటీఎం రూంలోకి ప్రవేశించిన దుండగులు ముఖాలు కనిపించకుండా మాస్క్ ధరించారు.
సీసీ కెమెరా పై స్ర్పే చేసి దొంగతనానికి పాల్పడ్డారు. ఏటీఎంలో ఉన్న సుమారు 17లక్షల నగదు అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. చోరీ జరిగిన ఏటీఎంలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు.