Viral Video: మొబైల్ షాప్ ఓనర్ కళ్ళలో కారం కొట్టి.. డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగ

Viral Video: మొబైల్ షాప్ ఓనర్ కళ్ళలో కారం కొట్టి.. డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగ

పట్టపగలే.. మొబైల్ షాప్ ఓనర్ కళ్ళలో కారం కొట్టి డబ్బులు ఎత్తుకెళ్లాడు ఓ దొంగ. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. బుధవారం ( ఏప్రిల్ 30 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి... ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్‌లో ఉన్న సుహైల్ అనే వ్యక్తికి చెందిన మొబైల్ షాపులో జరిగింది ఈ దోపిడీ. మాములు కస్టమర్ లాగా మొబైల్ షాపులోకి వచ్చి.. ఓనర్ కళ్ళలో కారం కొట్టి రూ. 50 వేలు ఎత్తుకెళ్లాడు ఓ దొంగ. 

ముఖానికి మాస్క్ ధరించి కస్టమర్ లాగా వచ్చిన దొంగ సుహైల్‌ను తన మొబైల్ ఫోన్‌ కు రూ.19కి రీఛార్జ్ చేయమని అడిగాడు. కొద్దిసేపటి తర్వాత అతను రూ.29కి మరో రీఛార్జ్‌ చేయామని అడిగాడు. సుహైల్ రీఛార్జ్‌లతో బిజీగా ఉండగా, ఆ వ్యక్తి తన జాకెట్‌లో నుంచి కారం పొడి తీసి సుహైల్ కళ్ళలో కొట్టాడు.

ఒక్కసారిగా కళ్ళలో కారం పడటంతో సుహైల్ కళ్ళు మండిపోయి ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యాడు. ఇంతలోనే తేరుకున్న సుహైల్ దొంగను పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ.. కళ్ళలో కారం నిండిపోవడంతో సరిగ్గా కనిపించక పట్టుకోలేకపోయాడు. దీంతో రూ. 50 వేలు లాక్కొని తప్పించుకు పారిపోయాడు దొంగ.

►ALSO READ | బాంబ్ పేలినట్లు పేలిన స్మార్ట్ టీవీ : 14 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలు

ఘటన జరిగిన సమయంలో సహాయం కోసం గట్టిగా అరిచాడు సుహైల్.. సుహైల్ అరుపులు విన్న స్థానికులు సుహైల్ కళ్ళు కడిగి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. సుహైల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలికి సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు వీడియో ఆధారంగా దుండగుడి కోసం గాలిస్తున్నారు.