హైదరాబాద్ పాతబస్తీలోని మోగల్ పురాలో దోపిడీ దొంగలు బీభత్సం చేశారు. బంగారు ఆభరణాలు తయ్యారు చేసే ఓ ఇంట్లోకి అక్రమంగా చోరబడింది దోపిడీ గ్యాంగ్. ఇంట్లో ఉన్న వారిపై విచక్షణారహితంగా దాడి చేసి.. అల్మరా తాళాలు పగల గొట్టి అందులో ఉన్న 300 గ్రాముల బంగారు ఆభరణాల చోరి చేశారు దుండగులు.
దొంగిలించిన బంగారంతో పారి పోతున్న నలుగురు దొంగలను స్థానికులు పట్టుకొని చితకబాదారు. ఈ దాడిలో గాయపడ్డ నలుగురు దొంగలకు గాయాలైయ్యాయి. దుండగులు వారి నుండి తప్పించుకొని బంగారు ఆభరణాలతో పరారైయ్యారు. వెంటనే బాధితులు మోగల్ పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నా పోలీసులు.. బీభత్సం సృష్టించిన ఆ నలుగురు దుండగులు ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.