అన్నం పెట్టిన యజమాని ఇంటికే కన్నం వేశారు ఈ నిందితులు. నమ్మకంగా పనిచేస్తూ యజమానినే మోసం చేశారు. ఈ ఘటన కుత్బుల్లాపూర్ లోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దురు వ్యక్తులు స్థానికంగా ఉంటూ ఇంటి యజమాని దగ్గర పనికి చేరారు. అనంతరం ఆ యజమానినే మోసం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో నగదు, బంగారం తదితర విలువైన అభరణాలే టార్గెట్గా దొంగతనాలు చేశారు.
యజమానికి అనుమానం వచ్చి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు దొంగతనం చేస్తున్న వారి గురించి కూపీ లాగారు. ఇంట్లో పనికి దిగిన వారే ఇదంతా చేస్తున్నారని తెలిసి నిందితుల వేలు ముద్రల ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి 45 తులాలు బంగారం, 3కేజీల వెండి, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లుగా మేడ్చల్ డీసీపీ సందీప్ తెలిపారు.