సెలబ్రిటీ రిసార్ట్ క్లబ్లో దొంగల బీభత్సం

హైదరాబాద్ లో దొంగలు బీభత్సం సృష్టించారు.  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట్ లోని సెలబ్రిటీ రిసార్ట్ క్లబ్ లో దొంగతనానికి పాల్పడ్డారు. క్లబ్ లోని విల్లా నంబర్ 9లోని మహేందర్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి నివాసం ఉంటున్నారు. 

అయితే అతను ఇటీవల తన కూతురు కోసం న్యూజిలాండ్ వెళ్లాడు. ఈ క్రమంలో ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లోని  రూ. 4,5 లక్షల నగదు, 10 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.  మహేందర్ బందువు ఇంటికి వచ్చి చూడగా వేసిన తాళం పగులగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. 

దీంతో  సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.