కల్లూర్ వైన్స్​లో చోరీ

కుంటాల, వెలుగు: కుంటాల మండలం కల్లూర్ గ్రామంలోని శ్రీ సాయి లక్ష్మీ వైన్స్ లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఓ వాహనంలో వచ్చిన దొంగలు ముందుగా బయట ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. షట్టర్​ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి రూ.లక్ష  విలువ చేసే మద్యం, కౌంటర్​లో ఉన్న రూ.వేయి నగదు ఎత్తుకెళ్లారు. లోపల ఉన్న ఓ సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. చోరీ సమాచారం తెలుసుకున్న బైంసా రూరల్ సీఐ నైలు, ఎస్ఐ హన్మండ్లు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.