
గజ్వేల్(వర్గల్), వెలుగు : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గోవిందాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి తాళం వేసిన ఇండ్లలో చోరీ జరిగింది. ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లింగ శ్రీనివాస్, కేసరి రామవ్వ మరో ముగ్గురు ఇండ్లకు తాళాలు వేసి బంధువుల ఇండ్లకు వెళ్లారు. గురువారం ఉదయం వీరి ఇండ్ల తలుపులు తెరచి ఉండడాన్ని గమనించిన గ్రామస్తులు బాధితులకు సమాచారం ఇచ్చారు.
ఈ మేరకు లింగ శ్రీనివాస్, కేసరి రామవ్వల ఇండ్లలో బీరువాలో ఉంచిన బంగారు, వెండి నగలు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. మరో మూడు ఇండ్లలోకి ఎలాంటి వస్తువులు పోలేదని తెలిసింది. మొత్తం రూ.2 లక్షల విలువైన నగలు చోరీ అయినట్లు ఎస్ఐ తెలిపారు.