కేసీఆర్ కాలనీలో దొంగల బీభత్సం.. 10 ఇండ్ల తాళాలు పగలకొట్టి చోరీ

కేసీఆర్ కాలనీలో దొంగల బీభత్సం.. 10 ఇండ్ల తాళాలు పగలకొట్టి చోరీ

రామాయంపేట, వెలుగు: రామాయంపేట మున్సిపాలిటీలోని కేసీఆర్ కాలనీలో బుధవారం రాత్రి దొంగలు బీభత్సం చేశారు. 10 ఇండ్లలో చొరబడి సుమారు రూ. 50 వేల విలువైన సొత్తును ఎత్తుకెళ్లారు. కాలనీలోని నాగరాణి, ప్రేమలత, సంతోష, పెంటమ్మతో పాటు మరో ఆరు ఇండ్ల తాళాలను దొంగలు పగులగొట్టి సామగ్రి చిందర వందర చేశారు. ప్రేమలత ఇంట్లోని10 తులాల వెండితో పాటు బీరువలోని చీరలు, నాగరాణి ఇంట్లో 2 గ్రాముల కమ్మలు, తులం వెండి, ఇతరులు ఇండ్లలో బట్టలను ఎత్తు కెళ్లారు. బాధితులు గురువారం స్థానిక పోలీసుస్టేషన్‎లో ఫిర్యాదు చేయగా క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలరాజు తెలిపారు.